కాంగ్రెస్‌కు షాక్... మైనంపల్లి రాకను వ్యతిరేకిస్తూ మెదక్ డీసీసీ అధ్యక్షుడి రాజీనామా
- పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కంఠారెడ్డి తిరుపతి రెడ్డి
- కష్టపడి పని చేసిన తనలాంటి వారికి కాంగ్రెస్‌లో గుర్తింపు లేదని ఆవేదన
- మెదక్‌లో మైనంపల్లి రోహిత్‌కు టికెట్ హామీ ఇచ్చిన అధిష్టానం
మైనంపల్లి చేరికను వ్యతిరేకించిన ఆయన పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనలాంటి కార్యకర్తలకు కాంగ్రెస్‌లో స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలు, త్యాగాలు, పడ్డ కష్టాలు గుర్తించకుండా కేవలం డబ్బు సంచులే ప్రాతిపదికగా టికెట్లు ఇవ్వడం వేదనకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏ పార్టీలో చేరబోయేది ఆయన వెల్లడించలేదు. మరోవైపు మైనంపల్లి రాకతో మల్కాజిగిరి అసెంబ్లీ సీటు ఆశిస్తున్న కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ కూడా అసంతృప్తిగా ఉన్నారు.