SuperStar: మహేశ్ బాబు కూతురు మంచి మనసు.. వీడియో ఇదిగో!

Both SuperStar Mahesh And Sitara Had Such Kind Hearts
  • వృద్ధురాలిని దగ్గరుండి మెట్లు ఎక్కించిన సితార
  • లైక్ ఫాదర్.. లైక్ డాటర్ అంటూ మురిసిపోతున్న అభిమానులు
  • గతంలో మహేశ్ బాబు ఇలాగే సాయంచేసిన వీడియో కలిపి షేర్ చేస్తున్న నెటిజన్లు
నటుడు మహేశ్ బాబు కూతురు ఘట్టమనేని సితార మంచి మనసును చాటే ఘటన తాజాగా చోటుచేసుకుంది. పెద్దల పట్ల గౌరవం చూపించే సందర్భాల్లో హోదాలు, అంతస్తులు గుర్తురావని సితార తన చేష్టలతో చూపించారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ షాపింగ్ మాల్ లో దసరా సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి మహేశ్ బాబు సతీమణి నమ్రత, వారి కూతురు సితార హాజరయ్యారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నిర్వాహకులు పేద వృద్ధులు, మహిళలకు వివిధ బహుమతులు అందించారు. ఈ కానుకలు అందుకోవడానికి స్టేజిపైకి రావడానికి ఓ వృద్ధురాలు ఇబ్బంది పడగా సితార వెంటనే స్పందించింది. స్టేజి దిగి ఆ వృద్ధురాలు భుజం పట్టుకుని మెట్లు ఎక్కించింది. ఆ తర్వాత వారితో కలిసిపోయి నవ్వుతూ ఫొటోలు దిగింది.

ఈ ఘటనను మహేశ్ అభిమాని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మహేశ్ బాబు కూడా ఇలాగే ఓ మహిళకు సాయమందించారు. ఆ వీడియోతో కలిపి సితార వీడియోను పోస్ట్ చేస్తూ తండ్రికి తగ్గ కూతురు అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. పేదలు, వృద్ధుల పట్ల గౌరవంగా ప్రవర్తించడం అనేది ఘట్టమనేని రక్తంలోనే ఉందని మరో అభిమాని కామెంట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు సితారపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

More Telugu News

SuperStar
Mahesh Babu
Sitara
Sitara Kind Heart
Viral Videos