కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నా.. బెయిల్ పొడిగించండి: వైఎస్ భాస్కర్ రెడ్డి
- కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన భాస్కర్ రెడ్డి
- ఎస్కార్ట్ బెయిల్ పొడిగించాలని కోర్టుకు విజ్ఞప్తి
- ఈ నెల 3న విచారణ చేపడతామన్న న్యాయస్థానం
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఈ నెల 3న విచారించనున్నట్లు పేర్కొంది. కాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే! ఈ కేసులో అక్టోబర్ 3 (మంగళవారం) వరకు భాస్కర్ రెడ్డికి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు సమీపిస్తుండడంతో వైఎస్ భాస్కర్ రెడ్డి మరోమారు కోర్టును ఆశ్రయించారు.