పండగల ముంగిట వంట గ్యాస్ పోటు.. వాణిజ్య సిలిండర్‌పై రూ. 209 పెంపు
- 19కిలోల వాణిజ్య సిలిండర్ ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు
- తక్షణమే అమల్లోకి కొత్త రేట్లు
- డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో మార్పు చేయని కంపెనీలు
కానీ, పండుగ సీజన్ ముంగిట వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం అందరిపై ప్రభావం పడనుంది. తాజా పెంపు తర్వాత ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1731.50కి చేరింది. కోల్‌కతాలో రూ. 1839కి చేరగా.. హైదరాబాద్‌లో ఏకంగా రూ. 1956.50కు చేరుకుంది. విజయవాడలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.1888.50గా ఉంది.