విమాన ప్రయాణికుడి దురుసు ప్రవర్తన...బాత్రూమ్ లోపలి నుంచి లాక్ చేసుకున్న వైనం
- హైదరాబాద్ నుంచి పాట్నా వెళుతున్న ఇండిగో విమానంలో ఇటీవల ఘటన
- ప్రయాణికుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడన్న పోలీసులు
- అతడి వద్ద మెడికల్ రికార్డులు కూడా లభ్యం
- సిబ్బంది ఫిర్యాదు మేరకు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్యాసింజర్‌ను కమార్ రియాజ్‌గా పోలీసులు గుర్తించారు. తన సోదరుడితో కలిసి అతడు విమానంలో పాట్నాకు బయలుదేరాడు. అయితే, ప్రయాణికుడికి మానసిక సమస్యలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని, మెడికల్ రిపోర్టులు అతడి వద్ద ఉన్నాయని తెలిపారు. విమాన సిబ్బంది ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు.