సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'మార్టిన్ లూథర్ కింగ్'

Martin Luther King movie gets clean U certificate
  • సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో మార్టిన్ లూథర్ కింగ్
  • పూజా కొల్లూరు దర్శకత్వం
  • అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
  • 'యూ' సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు
సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో పూజా కొల్లూరు దర్శకత్వంలో వస్తున్న చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ 'యూ' సర్టిఫికెట్ జారీ చేసింది. 

మార్టిన్ లూథర్ కింగ్ చిత్రం దసరా సీజన్ లో అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పొలిటికల్ కామెడీ జానర్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తమిళంలో యోగిబాబు నటించిన మండేలా చిత్రానికి రీమేక్ అని టాక్ వినిపిస్తోంది. 

2021లో వచ్చిన క్యాలీఫ్లవర్ చిత్రం తర్వాత సంపూ నటిస్తున్న సినిమా ఇదే. సీనియర్ నటుడు నరేశ్, వెంకటేశ్ మహా, శరణ్య ప్రదీప్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టయిన్ మెంట్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది.
Go Back to Shorts
Martin Luther King
U
Censor
Sampoornesh Babu
Puja Kolluru

More Telugu News