తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు... సర్వదర్శన టోకెన్ల జారీ రద్దు చేసిన టీటీడీ
- తిరుమల కొండపై పెరిగిన భక్తుల రద్దీ
- స్వామివారి సర్వదర్శనానికి 30 గంటల సమయం
- కొన్నిరోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని టీటీడీ అంచనా
పురటాసి శనివారాలకు తోడు, కొన్ని సెలవులు కూడా కలిసి రావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని టీటీడీ వెల్లడించింది. దాంతో, ప్రతి రోజూ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శన టోకెన్ల జారీ అక్టోబరు 1, 7, 8, 14, 15 తేదీల్లో రద్దు చేస్తున్నామని పేర్కొంది. భక్తులు ఈ మార్పును గమనించి, తమకు సహకరించాలని టీటీడీ తన ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.