Motha Mogiddam: ఢిల్లీలో లోకేశ్... రాజమండ్రిలో బ్రాహ్మణి... మోత మోగించారు!... ఫొటోలు ఇవిగో!

  • స్కిల్ కేసులో రిమాండులో వున్న చంద్రబాబు 
  • మోత మోగిద్దాం కార్యక్రమం ద్వారా నిరసన తెలపాలంటూ టీడీపీ పిలుపు
  • టీడీపీ కార్యాచరణకు నేడు విశేష స్పందన
  • ఢిల్లీలో ప్లేటు వాయించిన రఘురామ... చిడతలు కొట్టిన కనకమేడల
Lokesh and Brahmani participates in Motha Mogiddam program

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఐదు నిమిషాల పాటు మోత మోగిద్దాం కార్యాచరణకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బయటికి వచ్చి మోత మోగించాయి. ప్లేట్లు కొడుతూ, విజిల్స్ వేస్తూ, హారన్లు మోగిస్తూ నిరసన తెలిపారు. ఢిల్లీలో ఎంపీ గల్లా జయదేవ్ నివాసం వద్ద టీడీపీ నేతలతో కలిసి నారా లోకేశ్ గంట వాయించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు. ఆయన పళ్లెం వాయించారు. కనకమేడల రవీంద్రకుమార్ చిడతలు కొట్టారు. 

ఇక, రాజమండ్రిలో ఉన్న నారా బ్రాహ్మణి సైతం ఎంతో ఉత్సాహంగా మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రాహ్మణి మహిళా కార్యకర్తలతో కలిసి బ్యాండు వాయించారు. 

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ ప్రధాన కార్యాలయంలో మోత మోగించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల టీడీపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.

More Telugu News