చంద్రబాబు మాజీ పీఎస్ ను సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం
- సర్వీస్ రూల్స్ అతిక్రమించారంటూ వేటు
- పర్సనల్ టూర్ లో భాగంగా అమెరికా వెళ్లిన శ్రీనివాస్
- ‘స్కిల్’ కేసులో శ్రీనివాస్ పైనా ఆరోపణలు
ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయలేదని, అనుమతి లేకుండానే ఆయన అమెరికా వెళ్లారని సమాచారం. నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ అధికారులు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకుంటే ముందుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతి తీసుకున్నాకే విదేశాలకు వెళ్లాలి. ఈ నిబంధనను అతిక్రమించడంతో పెండ్యాల శ్రీనివాస్ కు ప్లానింగ్ డిపార్ట్ మెంట్ మెమో జారీ చేసింది. అమెరికా టూర్ పై వారం రోజుల్లో వచ్చి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. అయినా పెండ్యాల శ్రీనివాస్ రాకపోవడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.