విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె.. చూసేందుకు ఎగబడిన జనం!
- వైఎంసీఏ తీరానికి కొట్టుకొచ్చిన పెట్టె
- అందులో విలువైన సంపద ఉండే అవకాశం ఉందని చర్చ
- రాత్రంతా కాపలాగా ఉన్న పోలీసులు
- పురావస్తుశాఖకు సమాచారం
వైఎంసీఏ బీచ్‌లోకి పెట్టె కొట్టుకు వచ్చిందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని దానికి కాపలాగా ఉన్నారు. పెట్టెను ఎవరూ ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పురావస్తుశాఖ అధికారులు వచ్చి పెట్టెను తెరిచే అవకాశం ఉందని, వారికి ఇప్పటికే సమాచారం అందించినట్టు చెబుతున్నారు. ఇంత భారీ పెట్టె సముద్ర తీరానికి కొట్టుకురావడం ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందన్నది మాత్రం మిస్టరీగా మారింది.