నేటితో ఆర్బీఐ ఇచ్చిన గడువు పూర్తి! రేపటి నుంచీ రూ.2 వేల నోట్లు చెల్లవా?
- రూ.2 వేల నోటు మార్పిడికి నేడే డెడ్‌లైన్
- రేపటి నుంచి ఆర్థిక లావాదేవీలకు ఈ నోటు ఉపయోగపడదంటూ గతంలోనే ఆర్బీఐ ప్రకటన
- లీగల్ టెండర్‌గా మాత్రం కొనసాగుతుందని స్పష్టీకరణ
- అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ శాఖల్లో మాత్రమే నోటును మార్చుకునే ఛాన్స్
సెప్టెంబర్ 30లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని మే 16న ఆర్బీఐ ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచీ ఈ నోటుతో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే, నోటు మాత్రం యథావిధిగా లీగల్ టెండర్‌గా కొనసాగుతుంది. అంటే.. ప్రజలు అక్టోబర్ 1 నుంచీ ఈ నోటును కేవలం ఆర్బీఐ శాఖల్లో మాత్రమే మార్చుకోగలరు. మునుపటి వలే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా బ్యాంకుల్లోనే ఇతర నోట్లుగా మార్చుకోవడం కుదరదు.
అయితే, అక్టోబర్ నుంచీ ఆర్బీఐ శాఖల్లో ఈ నోట్లు మార్చుకునే వారు పాత డెడ్‌లైన్ ఎందుకు మిస్సయ్యారో చెప్పాల్సి ఉంటుంది.