దసరా నాటికి విశాఖ వచ్చేస్తానని జగన్ చెప్పడం అక్కడి ప్రజలకు దుర్వార్త: గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao take a dig at CM Jagan
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏపీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడంతోనే ప్రజావేదిక కూల్చిన జగన్ విధ్వంసానికి నాంది పలికారని విమర్శించారు. ఆర్థిక నేరాలకు కారణంగా అరెస్టయిన జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని, 99 శాతం ఫెయిల్యూర్ పర్సన్ జగన్ అని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి దసరా నాటికి విశాఖ వచ్చేస్తానని అనడం అక్కడి ప్రజలకు నిజంగా దుర్వార్తేనని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ అన్ని అక్రమాలకు నిలయంగా మారిందని, ఇక జగన్ అడుగుపెడితే పులివెందుల సంస్కృతి కూడా వచ్చేస్తుందని అన్నారు.
Go Back to Shorts
Ganta Srinivasa Rao
YS Jagan
Visakhapatnam
TDP
YSRCP

More Telugu News