Actor Prakash Raj: నటుడు సిద్ధార్థకు ప్రకాశ్‌రాజ్ క్షమాపణలు

సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్ మరో నటుడు సిద్ధార్థకు కర్ణాటక ప్రజల తరపున క్షమాపణలు చెప్పారు. తన సినిమా చిత్త (కన్నడంలో చిక్కు) ప్రచారం కోసం సిద్ధార్థ బెంగళూరు వచ్చారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడడం ప్రారంభించడానికి ముందు కన్నడ అనుకూల సంస్థల సభ్యులు ఆటంకం కలిగించారు. కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన కొనసాగుతున్నా సరే సిద్ధార్థ మాట్లాడడం కొనసాగించడం ప్రారంభించాడు. 

తమ కావేరీ ఉద్యమానికి మద్దతు తెలపాలని నిరసనకారులు సిద్ధార్థను డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రక్తంగా మారింది. దీంతో సిద్ధార్థం చేతులు జోడించి అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్పందించిన ప్రకాశ్‌రాజ్ ఎక్స్ ద్వారా సిద్ధార్థకు క్షమాపణలు తెలిపారు. 

కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ సమస్య దశాబ్దాలుగా ఉందని, ఇన్నేళ్ల కాలంలో సమస్యను పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలు, నాయకులను ప్రశ్నించలేదని, సమస్య పరిష్కారం కోసం కేంద్రం వద్ద ఒత్తిడి తీసుకురాలేని కుంటి ఎంపీలను ప్రశ్నించకుండా నిస్సహాయ సామాన్యులను, కళాకారులను చిత్రహింసలకు గురిచేయడం తప్పని, అందుకు కన్నడ ప్రజల తరపున సిద్ధార్థకు క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు.
Actor Prakash Raj
Actor Siddharth
Kannada
Bengaluru
Chithha
Cauvery Issue

More Telugu News