Khairatabad Maha Ganapathi: ఖైరతాబాద్ మహా గణపతికి ఘనంగా వీడ్కోలు పలికిన భక్తులు... క్రేన్ నెం.4 వద్ద నిమజ్జనం పూర్తి

  • హైదరాబాదులో గణేశుడి శోభాయాత్ర
  • ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ గణపతి
  • క్రేన్ నెం.4 వద్ద చివరి పూజలు
  • మధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం పూర్తి
Khairatabad Maha Ganapathi immersion completed

హైదరాబాదులో ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి ఈ మధ్యాహ్నం తర్వాత హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు. ఇక్కడి ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెం.4 వద్ద ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేశారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో మహా వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. 

ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ విఘ్ననాథుడి శోభా యాత్ర టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంది. ఈ శోభా యాత్ర కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. క్రేన్ నెం.4 వద్ద చివరి పూజలు నిర్వహించారు. 

ఈ మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీ దశ మహా విద్యా గణపతి నిమజ్జనం పూర్తయింది. ఎప్పుడూ చివరగా తరలివెళ్లే ఖైరతాబాద్ మహా వినాయకుడ్ని ఈసారి ముందుగానే నిమజ్జనం చేశారు. ప్రస్తుతం గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది.

More Telugu News