మహిళా వ్యాపార భాగస్వామిని చితకబాదిన స్పా మేనేజర్
- గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఘటన
- నాలుగు నిమిషాల పాటు.. దుస్తులు చిరిగేలా కొట్టిన వ్యక్తి
- వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు
స్పా నిర్వాహకుడు మోహిసిన్ ఆ మహిళను బలవంతంగా స్పా లోపలికి ఈడ్చుకుపోవడం చూడొచ్చు. కొంత వ్యవధి తర్వాత ఆ డోర్ ను తన్నుకుని మహిళా బయటకు వచ్చింది. ఆమె కుర్తా చినిగిపోయి పేలికలుగా కనిపిస్తోంది. దుస్తులు చినిగేంతగా అతడు ఆమెపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ వీడియో చూసే వారి మనసును కదిలించే విధంగా ఉంది. ఈ ఘటన ఈ నెల 25న జరిగింది.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చేరి, వైరల్ గా మారిపోవడంతో, పోలీసులు రంగంలోకి దిగారు. గెలాక్సీ స్పా నిర్వాహకుడు మోహిసిన్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఈ దాడి జరిగి రెండు రోజులు గడిచినప్పటికీ బాధిత మహిళ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ ఇవ్వలేదు. సోషల్ వర్కర్ సాయంతో సదరు మహిళను పోలీసులు సంప్రదించారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించారు. మోహిసిన్ తనకు స్పాలో వ్యాపార భాగస్వామిగా ఉన్నట్టు ఆమె పోలీసులకు చెప్పింది.