ఇది ట్రైలరే.. మల్కాజిగిరిలో మల్లన్న సినిమా చూపిస్తా: మంత్రి మల్లారెడ్డి
- మల్కాజిగిరిలో భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి
- బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి
- మల్కాజిగిరి అసెంబ్లీకి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోటీ చేసే అవకాశం
అనంతరం జరిగిన సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్కు డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదని చెప్పారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో మల్లన్న సినిమా చూపిస్తానని, ఇది ట్రైలర్ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్లో గూండాలు, రౌడీలు, కబ్జాకోరులు ఉన్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు వారిని తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు