డజన్ల కొద్దీ శునకాలపై అత్యాచారానికి పాల్పడి చిత్రహింసలు పెట్టి చంపేసిన బ్రిటిష్ మొసళ్ల నిపుణుడు
- బీబీసీ, నేషనల్ జియోగ్రఫీలో పనిచేసిన ఆడం బ్రిట్టన్
- అరెస్టుకు 18 నెలల ముందు 42 శునకాలపై అత్యాచారం.. వాటిలో 39 మృతి
- ఈ మొత్తం ఘటనను రికార్డు చేసిన బ్రిట్టన్
- మొత్తం 60 అభియోగాలు
కేసు విచారణ సందర్భంగా నార్తర్న్ టెరిటరీ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడి నేరాలు రికార్డు చేసి ఉన్నందున అవి చూసిన వారు ‘నెర్వస్ షాక్’కు గురయ్యే అవకాశం ఉందని, కాబట్టి కోర్టు గది నుంచి బయటకు వెళ్లిపోవాలని హియిరింగ్ కోసం వచ్చిన వారిని కోరింది. 2014 నుంచి నిందితుడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు.
జంతుశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన బ్రిట్టన్ శునకాలపై అత్యాచారానికి పాల్పడుతున్న వీడియో వెలుగులోకి రావడంతో గతేడాది పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు 18 నెలల ముందు 42 శునకాలపై అత్యాచారానికి పాల్పడగా వాటిలో 39 ప్రాణాలు కోల్పోయాయి. కాగా, ఆడంకు శిక్ష ఖరారు కావాల్సి ఉంది.