చంద్రబాబుపై ఒవైసీకి ఎంత కక్ష ఉందో అర్థమయింది: టీడీపీ నేత షరీఫ్
- చంద్రబాబు జైల్లో హాయిగా ఉన్నారన్న ఒవైసీ
- జైలు అంటే విహార కేంద్రమా అని మండిపడ్డ షరీఫ్
- ముస్లింలను ఇబ్బంది పెడుతున్న జగన్ ను సపోర్ట్ చేయాలని ఎలా చెపుతారని ప్రశ్న
ఏపీలో ముస్లింలను జగన్ అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని... ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన జగన్ ను సపోర్ట్ చేయాలని ఒవైసీ ఎలా చెపుతారని షరీఫ్ దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలను అన్ని రకాలుగా ఆదుకున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో వంద మందికి పైగా మైనార్టీలపై దాడులు జరిగాయని తెలిపారు. కేవలం చంద్రబాబుపై ద్వేషంతోనే ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. దమ్ముంటే ఏపీకి వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు.