మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం

  • టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత నిరవధిక నిరాహార దీక్ష
  • అనంతపురంలోని పాపంపేటలో రెండు రోజులుగా దీక్ష నిర్వహిస్తున్న వైనం
  • సోమవారం అర్ధరాత్రి ఆమెకు వైద్య పరీక్షలు
  • ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు సునీత దీక్ష భగ్నం చేసి ఆసుపత్రికి తరలింపు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు తాజాగా భగ్నం చేశారు. పరిటాల సునీత గత రెండు రోజులుగా అనంతపురంలోని పాపంపేటలో దీక్ష నిర్వహిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి వైద్యులు సునీతకు పరీక్షలు నిర్వహించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు మంగళవారం ఆమె దీక్షను భగ్నం చేసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇతర ముఖ్య నేతలను మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Paritala Sunitha
Andhra Pradesh
Chandrababu
Telugudesam

More Telugu News