Maharashtra: పట్టువదలని విక్రమార్కుడు.. 24వ ప్రయత్నంలో ప్రభుత్వోద్యోగం

  • మహారాష్ట్ర నాందేడ్ జిల్లా మాతల గ్రామంలో ఘటన
  • మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో 25వ ర్యాంకు సాధించిన సాగర్
  • 24వ ప్రయత్నంలో ప్రభుత్వోద్యోగం సాధించిన వైనం 
  • ట్యాక్స్ అసిస్టెంట్, క్లర్క్‌ ఉద్యోగాలకు ఎంపిక
Maharashtra youth secures government job in his 24th attempt

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వ్యక్తి పట్టువదలకుండా ప్రయత్నించి ప్రభుత్వోద్యోగం సాధించాడు. 23 సార్లు ప్రభుత్వ నియామక పరీక్షల్లో విఫలమైన సాగర్ నిరాశ చెందక తన ప్రయత్నాలను కొనసాగించి ఎట్టకేలకు విజయం అందుకున్నారు. ఇటీవల 24వ ప్రయత్నంలో ఏకంగా రెండు ప్రభుత్వోద్యోగాలను సాధించారు. 

మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో 25వ ర్యాంకు సాధించి ట్యాక్స్ అసిస్టెంట్‌గా, మంత్రుల కార్యాలయంలో క్లర్క్‌గా ఆఫర్ పొందారు. సాగర్ స్వస్థలం జిల్లాలోని మాతల గ్రామం. తమ గ్రామంలో మొదటి ప్రభుత్వోద్యోగి సాగర్ కావడంతో గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News