చంద్రబాబును ఏసీబీ న్యాయమూర్తి ఏం అడిగారంటే!?
- సీఐడీ విచారణ సందర్భంగా వైద్య పరీక్షల నిర్వహణపై జడ్జి ఆరా
- రేపు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపడతామన్న న్యాయమూర్తి
విచారణ సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించారా? ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వైద్య పరీక్షలు నిర్వహించారని, తనను ఏవిధంగా ఇబ్బంది పెట్టలేదని చెప్పారు.
ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి జడ్జి మాట్లాడుతూ... రేపు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామన్నారు. విచారణ సందర్భంగా ఏం గుర్తించారో బయట పెట్టాలని ఈ సందర్భంగా చంద్రబాబు విజ్ఞప్తి చేయగా, న్యాయమూర్తి స్పందిస్తూ... వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను మీ న్యాయవాది నుంచి తీసుకోవాలని జడ్జి సూచించారు.