Revanth Reddy: కాంగ్రెస్ గెలుపు ప్రజలకు తక్షణ అవసరం: రేవంత్ రెడ్డి

Revanth Reddy says Congress winning is must for people
  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న టీపీసీసీ చీఫ్
  • త్వరలో ముఖ్య నాయకులు పార్టీలో చేరుతారని ధీమా
  • కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో 86 మంది పక్క పార్టీలకు చెందినవారేనని విమర్శ
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మున్ముందు కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. ఇతర పార్టీలకు చెందిన కొంతమంది ముఖ్య నాయకులు త్వరలో పార్టీలో చేరి కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తారన్నారు. సోనియా గాంధీ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు సభ కోసం మైదానం ఇవ్వకపోయినా, హోటళ్లు ఇవ్వకపోయినా విజయభేరి సభ భారీ విజయం సాధించిందన్నారు.

కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులలో 86 మంది పక్క పార్టీల నుంచి వచ్చిన వారేనని ఎద్దేవా చేశారు. కానీ తమ పార్టీలో ఉంటే ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకవచ్చునన్నారు. తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛ లేదని, గౌరవం లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారికి గౌరవంగా, స్వేచ్ఛగా బతకవచ్చునన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. అందుకే ప్రజలు స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ గెలుపు ప్రజలకు తక్షణ అవసరమన్నారు.
Revanth Reddy
Congress
Telangana
Telangana Assembly Election

More Telugu News