Devineni Uma: జగన్ పదో బెయిల్ వార్షికోత్సవం చేసుకుంటున్నారు: దేవినేని ఉమ

  • అవినీతి కేసుల్లో జైలుకెళ్లిన వ్యక్తి ఈ రోజు అవినీతిపై నీతులు చెబుతున్నారని ఆగ్రహం
  • చంద్రబాబుపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టారన్న మాజీ మంత్రి
  • చంద్రబాబు ప్రజాసేవకుడన్న దేవినేని ఉమ
Devineni Uma says jagan is celebrating tenth bail anniversary

తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెట్టారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ ప్రస్తుతం పదో బెయిల్ వార్షికోత్సవం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన వ్యక్తి ఈ రోజు అవినీతిపై నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని, ఇది అక్రమ కేసు అన్నారు. అవినీతి కేసులో పదేళ్లు బెయిల్ పైన బయట ఉన్న జగన్, ఇప్పుడు ప్రజాసేవకుడైన చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపించారన్నారు.

More Telugu News