Hyderabad: మాదాపూర్‌లో రెండు భవనాలను క్షణాల్లో పేకమేడల్లా కూల్చేశారు

Mindspace Madhapur Buildings demolition
  • రహేజా మైండ్ స్పేస్‌లో రెండు భవనాల కూల్చివేత
  • ఏడు, ఎనిమిది బ్లాక్‌లలో రెండు నాలుగంతస్తుల భవనాలన్నీ ఆధునిక సాంకేతిక విధానంతో కూల్చేసిన వైనం
  • పక్కన భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కూల్చివేత
హైదరాబాద్‌లోని మాదాపూర్ మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాలను ఆధునిక సాంకేతిక విధనాలతో కేవలం ఐదు నిమిషాల్లోనే కూల్చివేశారు. రహేజా మైండ్ స్పేస్‌లోని ఏడు, ఎనిమిది బ్లాక్‌లలో నాలుగు అంతస్తుల భవనాలు రెండు వేర్వేరుగా ఉన్నాయి. ఈ భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడం కోసం రెండింటినీ కూల్చివేశారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రెండు భవనాలను నిమిషాల్లోనే కూల్చేశారు. పక్కన ఉన్న భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ భవనాలను పేకమేడల్లా కూల్చేశారు.
Hyderabad
madhapur
Telangana

More Telugu News