Ram Nath Kovind: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో తొలి సమావేశం

  • ఆయా పార్టీల నుంచి అభిప్రాయ సేకరణకు నిర్ణయం
  • జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయం
  • భారత న్యాయ కమిషన్‌కూ ఆహ్వానం
Ram Nath Kovind Chairs First Meeting Of One Nation One Election Panel

వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ శనివారం ఢిల్లీలో తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా రామ్ నాథ్ కమిటీ సభ్యులకు స్వాగతం పలికారు. సమావేశపు అజెండాను వివరించారు. జమిలి ఎన్నికలపై సూచనలను, అభిప్రాయాలను సేకరించేందుకు జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది.

గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, పార్లమెంటులో తమ ప్రతినిధులు ఉన్న పార్టీలు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది. దీంతో పాటు భారత న్యాయ కమిషన్‌ను కూడా కమిటీ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు కమిటీ ప్రకటన చేసింది. భేటీ సందర్భంగా పార్టీలతో చర్చలు జరపడం, జమిలి ఎన్నికలపై పరిశోధన తదితర అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది.

More Telugu News