భారత్ పై బురద జల్లడాన్ని కొనసాగిస్తున్న కెనడా ప్రధాని
- కొన్ని వారాల మందే భారత్ తో విషయాన్ని పంచుకున్నామని ప్రకటన
- భారత్ తమతో కలసి పనిచేస్తుందన్న ఆశాభావం
- రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయానికి సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయంటూ జస్టిన్ ట్రూడో గత సోమవారం కెనడా పార్లమెంటుకు వెల్లడించడం తెలిసిందే. అనంతరం భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్, కెనడా సీనియర్ దౌత్యవేత్తను దేశ బహిష్కరణ చేస్తూ, కెనడా వాసులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో రెండు దేశాల మధ్య వాతావరణం ఉప్పు నిప్పుగా మారిపోయింది.