కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ మరో గుడ్ న్యూస్
- వీడియో కంటెంట్ క్రియేషన్ కోసం ఉచిత ‘యూట్యూబ్ క్రియేట్’ యాప్
- యాప్‌లో జనరేటివ్ ఏఐ ఆధారిత ఫీచర్లు
- ప్రస్తుతం భారత్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులో ఉన్న యాప్
- వచ్చే ఏడాది యాపిల్ యూజర్లకూ యాప్ సిద్ధం
ఎడిటింగ్ ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ క్యాప్షనింగ్, వాయిస్ ఓవర్, ట్రాన్సిషన్స్ వంటి జనరేటివ్ ఏఐ ఆధారిత ఫీచర్లు కొత్త యాప్‌లో ఉన్నాయని యూట్యూబ్ పేర్కొంది. ఇక టిక్‌టాక్ లాంటి బీట్-మ్యాచింగ్ టెక్నాలజీతో రాయల్టీ ఫ్రీ మ్యూజిక్‌ను కూడా క్రియేటర్స్ వాడుకోవచ్చు. వీడియో క్రియేషన్, షేరింగ్ సులువుగా, మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ యాప్ డిజైన్ చేసినట్టు యూట్యూబ్ పేర్కొంది. ప్రస్తుతం ఇది భారత్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇండోనేషియా, కొరియా, సింగపూర్‌తో సహా పలు మార్కెట్లలో ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. వచ్చే ఏడాది ఐఫోన్ వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులోకి రానుంది.