లోకేశ్ గారు... తమరి లొకేషన్ ఎక్కడ? అంటూ అంబటి రాంబాబు వ్యంగ్యం

  • స్కిల్ కేసులో రిమాండులో చంద్రబాబు 
  • ఢిల్లీ వెళ్లిన నారా లోకేశ్
  • జాతీయ మీడియాకు విషయాలు వివరించే యత్నం
  • పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం
  • లోకేశ్ ను కూడా అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ కాగా, తమ అభిప్రాయాలను జాతీయ మీడియాకు వివరించేందుకు, జాతీయ నేతలను కలిసేందుకు నారా లోకేశ్ ఢిల్లీలో మకాం వేశారు. పార్లమెంటు సమావేశాల్లో చంద్రబాబు అంశాన్ని బలంగా వినిపించడంపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. 

అయితే, ఏపీ ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ ను అరెస్ట్ చేస్తారని, ఢిల్లీ నుంచి తిరిగి రాగానే ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, పరారీలో లోకేశ్ అంటూ ప్రముఖ టీవీ చానల్ పేరుమీద ఫేక్ కథనాలు కూడా వచ్చాయి. 

ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. హలో... లోకేశ్ గారు... తమరి లొకేషన్ ఎక్కడ? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. అయితే, నెటిజన్లు అంబటిపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

Ambati Rambabu
Nara Lokesh
Chandrababu
Arrest
New Delhi
YSRCP
TDP

More Telugu News