అసెంబ్లీ లాబీలో అనిల్ కుమార్ యాదవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ

  • అసెంబ్లీ లాబీలో ఎదురుపడ్డ అనిల్, బుచ్చయ్య చౌదరి
  • మీ పార్టీకి ఇదే చివరి సభ అన్న అనిల్
  • మాకు కాదు మీకే ఇది చివరి సభ అన్న గోరంట్ల
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీ లాబీలో ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించి మీకు ఇదే చివరి సభ అని అనిల్ అన్నారు. దీనికి సమాధానంగా... తనకు కాదు, మొత్తం మీ పార్టీకి ఇదే చివరి సభ అని కౌంటర్ ఇచ్చారు. బుచ్చయ్య వ్యాఖ్యలపై అనిల్ స్పందిస్తూ... మీరొక్కరు మళ్లీ సభకొస్తారేమో కానీ, మీ పార్టీలో ఇంకెవరూ రారని అన్నారు. దీనికి సమాధానంగా.. తానే కాదు, తమ పార్టీ మొత్తం సభకు రావడం ఖాయమని చెప్పారు.

Gorantla Butchaiah Chowdary
Telugudesam
Anil Kumar Yadav
YSRCP

More Telugu News