ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు.. ప్లకార్డులతో టీడీపీ ఆందోళన.. బుగ్గన ఆగ్రహం
- చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ
- స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు
- టీడీపీ సభ్యులు నోరు అదుపులో ఉంచుకోవాలన్న బుగ్గన
మరోవైపు, స్కిల్ డెవలప్ మెంట్ అంశంపై అసెంబ్లీలో ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఇంకోవైపు చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు తాము సిద్ధమని వైసీపీ సభ్యులు అంటున్నారు. సభలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ... టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదని మండిపడ్డారు. నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. టీడీపీ సభ్యుల తీరు ఏమాత్రం బాగోలేదని, సభలోకి వచ్చిన వెంటనే గోల చేస్తున్నారని మండిపడ్డారు. వయసుకు తగ్గట్టుగా టీడీపీ సభ్యులు వ్యవహరించడం లేదని అన్నారు.