కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 24న ప్రారంభం
- బెంగళూరు, హైదరాబాద్ మధ్య పరుగులు పెట్టనున్న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ రైలు
- ఈ నెల 24న వర్చువల్‌గా రైలును ప్రారంభించనున్న మోదీ
- అదే రోజున విజయవాడ- చెన్నై వందేభారత్ రైలు ప్రారంభం
- ఒకే రోజులో మొత్తం 9 రైళ్లను ప్రారంభించనున్న మోదీ
ఆదివారం ప్రధాని మోదీ మొత్తం 9 వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. వీటిల్లో విజయవాడ-చెన్నై వందేభారత్ కూడా ఉంది. విజయవాడలో ప్రారంభమయ్యే ఈ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. గురువారం మినహా మిగతా రోజుల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. రోజూ ఉదయం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, మధ్యాహ్నం 12.10 గంటలకు చెన్నై చేరుకుంటుందని వివరించారు. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20కి ప్రారంభమై రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుతుందని చెప్పారు.