హీరో నవదీప్‌ను విచారించనున్న పోలీసులు
- డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు నవదీప్
- తనను అరెస్ట్ చేయకుండా చూడాలని హైకోర్టును ఆశ్రయించిన నటుడు
- విచారణకు సహకరించాల్సిందేనని హైకోర్టు ఆదేశం
డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు కూడా వినిపించింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా చూడాలని నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసు విచారణకు సహకరించాలని నవదీప్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని పోలీసులకు సూచించింది.