కౌంటీ లో పుజారాపై ఒక మ్యాచ్ నిషేధం

  • కౌంటీల్లో ససెక్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పుజారా
  • లీసెస్టర్ షైర్ తో మ్యాచ్ లో గొడవపడ్డ ససెక్స్ జట్టు సభ్యులు
  • ఇప్పటి వరకు ససెక్స్ కు 12 డీమెరిట్ పాయింట్స్
టీమిండియా టెస్ట్ క్రికెట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ చటేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో చాలా సీజన్లుగా కీలక ఆటగాడిగా ఉన్నాడు. ప్రస్తుత సీజన్ లో ససెక్స్ జట్టు సారథిగా పుజారా వ్యవహరిస్తున్నాడు. తాజాగా పుజారాపై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తున్నట్టు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే లీసెస్టర్ షైర్ తో మ్యాచ్ లో ససెక్స్ జట్టు సభ్యులు గొడవకు దిగారు. దీంతో క్రమశిక్షణ చర్యల కింద ససెక్స్ జట్టుకు 4 డీమెరిట్ పాయింట్లు లభించాయి. దీంతో ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఆ జట్టుకు 12 డీమెరిట్ పాయింట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పుజారాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు.

Chateswar Pujara
Team India
County

More Telugu News