రాజ్ ఘాట్ వద్ద లోకేశ్ సహా టీడీపీ నేతల నివాళి.. మౌనదీక్ష..వీడియో ఇదిగో!
- మహాత్మాగాంధీ సమాధికి నివాళి అర్పించిన టీడీపీ నేతలు
- కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్, ఎంపీలు, కీలక నేతలు
- నల్ల బ్యాడ్జీలు ధరించి నివాళి
ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ... న్యాయస్థానంలో ఈ రోజు చంద్రబాబు పిటిషన్లు విచారణకు వస్తున్నాయని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని చెప్పారు. ఎలాంటి అవినీతి చేయని చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి, అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. మహాత్మాగాంధీ సమాధి వద్ద తాము నివాళి అర్పించే పరిస్థితిని సీఎం జగన్ తీసుకొచ్ఛారని మండిపడ్డారు.
