పండుగ రోజున ఇంటికి దూరంగా రాజమండ్రిలో చంద్రబాబు కుటుంబ సభ్యులు
- మూడు రోజులుగా ఢిల్లీలో లోకేశ్
- దేవాన్ష్‌ను తీసుకుని రాజమహేంద్రవరానికి వసుంధర
- భువనేశ్వరి, బ్రాహ్మణి, వసుంధరను కలుస్తున్న టీడీపీ నేతలు
- చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న నన్నపనేని రాజకుమారి
ప్రస్తుతం భువనేశ్వరి, బ్రాహ్మణి, వసుంధర రాజమహేంద్రవరంలోనే ఉన్నారు. పలువురు టీడీపీ నాయకులు వారిని కలిసి మాట్లాడి వెళ్తున్నారు. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు వంటి పరిపాలనాదక్షుడు రాష్ట్రానికి అవసరమని టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి అన్నారు. చంద్రబాబుకు నష్టం జరిగితే రాష్ట్రం మొత్తం నష్టపోతుందన్నారు. చంద్రబాబుపై ఎన్ని కుట్రలు చేసినా ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని నన్నపనేని పేర్కొన్నారు.