సింగర్ శ్రావణ భార్గవికి రెండో పెళ్లి అంటూ తప్పుడు ప్రచారం.. వాస్తవం ఇదే!

Singer Sravana Bhargavi second marriage
  • సింగర్ హేమచంద్రను ప్రేమ వివాహం చేసుకున్న శ్రావణ భార్గవి
  • ఇద్దరూ దూరంగా ఉంటున్నారని గతంలోనే ప్రచారం
  • వైరల్ అవుతున్న భార్గవి హల్దీ ఫంక్షన్ ఫొటోలు
టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. హల్దీ ఫంక్షన్ లో ఉన్న ఆమె ఫొటోలను షేర్ చేస్తూ... ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం చేస్తున్నారు. అయితే, ఆ ఫొటోలు భార్గవి సోదరుడి హల్దీ వేడుకలకు సంబంధించినవి.

మరోవైపు, సింగర్ హేమచంద్రను శ్రావణ భార్గవి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మంచి స్నేహితులైన వీరిద్దరూ పెద్దల అంగీకారంతో 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి జన్మించింది. వ్యక్తిగత విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారనే వార్తలు గతంలోనే వచ్చాయి. గత రెండేళ్లుగా వీరిద్దరూ కలిసి ఎక్కడా కనిపించలేదు. దీంతో, వీరు విడిపోయారనే తుది నిర్ణయానికి అందరూ వచ్చారు.
Advertisement
Sravana Bhargavi
Singer
Tollywood
Second Marriage

More Telugu News