Anushka Shetty: 17 ఏళ్ల తర్వాత నెరవేరబోతున్న అనుష్క కల.. మెగాస్టార్ సరసన ఛాన్స్

Anushka to pair with Chiranjeevi
షార్ట్స్‌లో చూడండి
అందాల భామ అనుష్క సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు (17 ఏళ్లు) అవుతోంది. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతో మంది హీరోల సరసన ఆమె నటించింది. మెగాస్టార్ చిరంజీవి సరసన మాత్రం ఆమె జతకట్టలేదు. ఈ విషయంలో సినీ అభిమానులకు కూడా ఒక అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఆ క్రేజీ కాంబినేషన్ కు సమయం ఆసన్నమయింది. 

చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో కొత్త చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అనుష్కను సంప్రదించారని టాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో అనుష్క దాదాపు కన్ఫామ్ అయిందని చెపుతున్నారు. మరోవైపు, తనకు చిరంజీవితో నటించాలనేది ఒక కల అని పలు సందర్భాల్లో అనుష్క తెలిపింది. ఇన్నేళ్లకు ఆమె కల సాకారం కాబోతోంది. 

Go Back to Shorts
Anushka Shetty
Chiranjeevi
Tollywood

More Telugu News