ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు... పార్టీలోకి పలువురు నేతల క్యూ

  • నేడు సోనియా సమక్షంలో తుమ్మల చేరిక
  • ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి 
  • ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
  • నిన్న పార్టీలో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నేత నల్లాల ఓదెలు, ఆయన భార్య
అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకుంటున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో నేడు జిట్టా కాంగ్రెస్‌ పార్టీలో చేరనుండగా, వేముల వీరేశం 18 లేదంటే 19న ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

మరోవైపు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Telangana Congress
Vemula Veeresham
Jitta Balakrishna Reddy
Nallala Odelu
Tummala Nageswara Rao

More Telugu News