అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు యువతికి మరణానంతర డిగ్రీ పట్టా ప్రదానం
- అమెరికాలో పోలీసు కారు ఢీకొనడంతో తెలుగు యువతి జాహ్నవి మృతి
- ఘటనపై సంఘీభావం ప్రకటించిన నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ
- ఈ దుర్ఘటనతో ప్రభావితమైన భారతీయ విద్యార్ధులందరికీ అండగా ఉంటామని హామీ
- యువతికి మరణానంతర డిగ్రీ ప్రదానం చేయనున్నట్టు ప్రకటన
‘‘జాహ్నవి మరణం, తదనంతర పరిణామాలతో మా క్యాంపస్‌లో భారతీయులందరూ కలత చెందారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ సంఘీభావం ప్రకటిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుతో బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా, మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న వారిని ఆదుకునేందుకు ఓ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసినట్టు పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జహ్నవి కందుల సౌత్ లేక్ యూనియన్ ప్రాంతంలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో మాస్టర్స్ చేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ ఏడాది జనవరి 23న రోడ్డు దాటుతుండగా ఆమెను పోలీసు కారు ఢీకొట్టడంతో దుర్మరణం చెందింది. స్టూడెంట్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కింద ఆమె 2021లో బెంగళూరు నుంచి అమెరికాకు వెళ్లింది. ఈ డిసెంబర్‌లో చదువు పూర్తి కావాల్సి ఉండగా ఇంతలోనే దారుణం జరిగిపోయింది.