నయనతారపై ఇప్పుడు ఇదే రూమర్!
- కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా నయనతార
- తెలుగు .. మలయాళంలోను అదే క్రేజ్
- 'జవాన్'తో బాలీవుడ్ లో జెండా ఎగరేసిన నయన్
- 10 కోట్లు డిమాండ్ చేస్తోందనే టాక్
సౌత్ లో నయనతార మిగతా అందరి హీరోయిన్స్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటూ ఉంటుంది. ఈ విషయంలో ఆమె ఎంత మాత్రం రాజీ పడదని అంటారు. అయితే ఆమె వర్కింగ్ స్టైల్ కూడా అంతే ఉంటుంది. తీసుకున్న పారితోషికానికి ఆమె పూర్తి న్యాయం చేస్తుందని అంటారు. అలాంటి నయనతార 'జవాన్' సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైంది .. భారీ విజయాన్ని పరిచయం చేసుకుంది.
దాంతో ఇప్పుడు బాలీవుడ్ లోని బడా మేకర్స్ ఆమెను తమ సినిమాలకు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారట. సౌత్ వరకే పరిమితమయ్యే తన సినిమాలకు 5 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్న నయనతార, పాన్ ఇండియా సినిమాలకుగాను 10 కోట్లు డిమాండ్ చేస్తోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ మాత్రం పారితోషికాన్ని బాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్స్ అందుకుంటూనే ఉన్నారు. నయన్ ఆ మాత్రం డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం కూడా లేదు. కాకపోతే ఆమె డిమాండ్ చేసిందా? లేదా? అనేదే ప్రశ్న.