చంద్రబాబుకు మద్దతుగా గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగుల ప్రదర్శన
- చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణలో కూడా నిరసనలు
- మధ్యాహ్నం 3 గంటలకు విప్రో సర్కిల్ వద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సంఘీభావ కార్యక్రమం
- 'ఐయాం విత్ సీబీఎన్' పేరుతో కార్యక్రమం
మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఏపీతో పాటు తెలంగాణలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ వైఖరిని తప్పుపడుతూ టీడీపీ మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. ఇంకోవైపు ఈ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 'ఐయాం విత్ సీబీఎన్' పేరుతో మెయిల్స్, సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఇన్విటేషన్ షేర్ అవుతోంది. 'రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలో చంద్రబాబు బాధితుడు. ఈ సంక్షోభ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది' అంటూ దీనికి సంబంధించిన పోస్టర్ లో పేర్కొన్నారు.