వియత్నాంలో ఓ అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు.. 50 మంది సజీవ దహనం
- హనోయిలోని 9 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం
- అపార్ట్మెంట్లో 45 కుటుంబాలు
- భవనం ఇరుకు సందులో ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం
ప్రమాదం సంభవించిన భవనంలో 45 కుటుంబాలు నివాసముంటున్నాయి. రాత్రి 11.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు అందరూ ఇళ్లలోనే ఉన్నారని అధికారులు తెలిపారు. భవనం ఇరుకు సందులో ఉండడంతో సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలిగినట్టు వియత్నాం అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.