Kuwait: ప్రవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కువైట్

  • చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న కువైట్
  • తాజాగా 989 మంది ప్రవాసులకు దేశ బహిష్కరణ
  • వీరంతా కార్మిక, నివాస చట్టాలను ఉల్లంఘించారంటున్న అధికారులు
Kuwait deported 989 foreigners

ప్రపంచంలోని పలు దేశాల నుంచి బతుకుదెరువు కోసం, ఎక్కువ సంపాదన కోసం ఎంతో మంది గల్ఫ్ దేశాల బాట పడుతుంటారు. ఈ దేశాల్లో సంపన్న దేశమైన కువైట్ కూడా ఒకటి. అయితే గత కొంత కాలంగా ప్రవాసుల పట్ల కువైట్ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్న విదేశీయులపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రవాసులను టార్గెట్ చేస్తూ క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో అక్రమంగా నివసిస్తున్న వారిని ఏ మాత్రం ఉపేక్షించకుండా దేశం నుంచి బహిష్కరిస్తోంది. 

తాజాగా 989 మంది ప్రవాసులను దేశం నుంచి కువైట్ బహిష్కరించింది. వీరంతా కార్మిక, నివాస చట్టాలను ఉల్లంఘించారని కువైట్ అధికారులు తెలిపారు. వీరిలో చాలా మందికి రెసిడెన్సీ గడువు ముగిసి పోయిందని, అయినప్పటికీ వీరు అనధికారికంగా ఉంటున్నారని చెప్పారు. కొంతమంది కొన్ని రోజుల పాటు కనిపించకుండా పోయి, ఆ తర్వాత చట్టబద్ధంగానే దేశంలో ఉన్నట్టు చూపిస్తున్నారని తెలిపారు. చట్ట విరుద్దంగా దేశంలో ఉండే వారిని ఉపేక్షించబోమని... ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

More Telugu News