కల్యాణ్​ రామ్​ ప్యాన్​ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్

Samyuktha Menon playing female lead in Kalyan ram Devil movie
  • టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న మలయాళ నటి
  • డెవిల్‌ చిత్రంలో నైషద పాత్రలో కనిపించనున్న సంయుక్త
  • ఫస్ట్ లుక్‌ విడుదల చేసిన చిత్ర బృందం
తక్కువ టైమ్‌లోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్న మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్. పవర్‌‌ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్‌‘లో మెప్పించిన ఆమె సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’తో భారీ హిట్ సొంతం చేసుకుంది. అంతకుముందు ధనుష్ సరసన ‘సార్’ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. దాంతో దక్షిణాదిలో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న స్పై థ్రిల్లర్ ‘డెవిల్’లో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. 

అభిషేక్ నామా రూపొందిస్తున్న ఈ పీరియాడిక్ మూవీలో బ్రిటీష్ గూఢచారిగా కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. ఆయనకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తోంది. నిన్న ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ తన ఫస్ట్‌ లుక్ పోస్టర్‌‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె నైషద అనే పాత్రను పోషిస్తోందని తెలిపింది. చీరకట్టు చేతిలో పువ్వులు, కొబ్బరికాయతో గుడికి వెళుతున్నట్టుగా ఈ పోస్టర్‌‌లో కనిపిస్తోంది. కాగా, ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 24న విడుదల కానుంది.
Go Back to Shorts
Samyuktha Menon
kalyan ram
devil
movie
Tollywood

More Telugu News