Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుతో స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్న మంత్రి రోజా

YCP Woman Minister RK Roja Celebrates TDP Chief Chandrababu Arrest
  • బాణసంచా కాల్చి స్వీట్లు పంచిన మహిళా మంత్రి
  • లోకేశ్, అచ్చెన్నాయుడు కూడా రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని హెచ్చరిక
  • చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలన్న మరో మంత్రి ధర్మాన
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాలతో గత రాత్రి రిమాండ్‌కు పంపడంతో వైసీపీ మహిళా మంత్రి రోజా సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన తప్పులన్నింటికీ రిటర్న్ గిఫ్ట్ వస్తుందని ఎద్దేవా చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, లోకేశ్ కూడా రోజులు లెక్కపెట్టుకోవాలని హెచ్చరించారు.

ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోపణలపై ఆధారాలు ఉండడం వల్లే కోర్టు రిమాండ్ విధించిందని అన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.
Chandrababu Arrest
RK Roja
YSRCP
Telugudesam

More Telugu News