Chandrababu: తెల్లవారుజామున 4 గంటలకు నిద్రపోయిన చంద్రబాబు.. జైల్లో బాబుకు ఒక సహాయకుడు, ఐదుగురు భద్రతా సిబ్బంది!

  • జీవితంలో తొలిసారి జైలు జీవితాన్ని గడుపుతున్న చంద్రబాబు
  • రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత
  • కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షలు
  • అల్పాహారం అనంతరం ములాఖత్ కు అనుమతించే అవకాశం
  • రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ
5 security and a helper for Chandrababu in Jail

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నిన్న సాయంత్రం విజయవాడలోని ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జైల్లోని స్నేహ బ్లాక్ లో ఆయనకు ఒక ప్రత్యేక గదిని కేటాయించారు. ఐదుగురు సిబ్బందితో ఆయనకు భద్రతను కల్పించారు. చంద్రబాబుకు ఒక సహాయకుడిని నియమించారు. ఆయనకు ఆహారం, మందులను సహాయకుడు దగ్గరుండి అందిస్తాడు. చంద్రబాబు మంచి చెడ్డలను సహాయకుడు చూసుకుంటాడు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు ఇంటి ఆహారాన్ని అందించనున్నారు. టీడీపీ అధినేతకు జైల్లో అన్ని వసతులను కల్పించారు.

మరోవైపున తెల్లవారుజామున 4 గంటలకు చంద్రబాబు పడుకున్నట్టు సమాచారం. ఉదయం 8 గంటల వరకు ఆయన పడుకున్నారు. ఈరోజు చంద్రబాబును కలిసే వారికి ములాఖత్ కు అనుమతించే అవకాశం ఉంది. భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్ ను ములాఖత్ కు అనుమతించవచ్చు. కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అల్పాహారం తీసుకున్న తర్వాత ములాఖత్ కు అనుమతించే అవకాశం ఉంది. 

రాజమండ్రి సెంట్రల్ జైల్ చుట్టూ 300 మంది పోలీసులు మోహరించారు. నగరంలో సెక్షన్ 30 విధించారు. రాజమండ్రి మొత్తం పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. 36 పికెటింగ్ లతో పహారా కాస్తున్నారు. మరోవైపు, ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News