Chandrababu Arrest: ఏపీలో కొనసాగుతున్న టీడీపీ బంద్.. ఆందోళనకారులను పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పోలీసులు

AP bandh continues as called by TDP
  • టీడీపీ పిలుపు మేరకు రోడ్లపైకిి వచ్చి నిరసన తెలుపుతున్న కార్యకర్తలు, నేతలు
  • రోడ్లపై బైఠాయించి నిరసన
  • చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్  కొనసాగుతోంది. కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, కూడళ్లలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఒంగోలు బస్టాండ్, గిద్దలూరు బస్టాండ్ల వద్ద ఆందోళన కొనసాగుతోంది. బస్సులను అడ్డుకున్న కార్యకర్తలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విజయనగరంలో బస్టాండ్ ముందు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. 

తిరుపతిలోని అంబేద్కర్ కూడలి వద్ద టీడీపీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్ డిపో ఎదుట టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను, నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు.

  • Loading...

More Telugu News