క్రిమినల్ కి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది: పవన్ కల్యాణ్
- ఏపీకి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వీసా కావాలి అంటుందేమోనని ప్రశ్న
- చంద్రబాబును అరెస్ట్ చేస్తారని తాము ముందుగా ఊహించలేదన్న పవన్
- వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ కోసం ప్లాన్ చేసుకున్నామన్న జనసేన అధినేత
ఆంధ్రప్రదేశ్ రావడానికి వీసా కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం అంటుందేమో? అని పవన్ ఎద్దేవా చేశారు. ‘రౌడీలు, గూండాలకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది. ట్రాఫిక్ అగిపోయింది. చాలా మంది బాధ పడుతున్నారు. ఫ్లయిట్ లో వెళ్తానంటే ఎక్కనివ్వలేదు. కారులో వెళ్తామంటే అనుమతివ్వడం లేదు. నడిచి వెళ్తామన్నా అనుమతి ఇవ్వడం లేదు. విశాఖలో కూడా ఇలాగే చేశారు. ఏం చేయాలి. గూండాలు, దోపిడీ చేసే వారికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది. అది అందరికీ అర్థం అవుతోంది. ఒకపక్క జాతీయ స్థాయిలో జీ20 సమ్మిట్ జరుగుతోంది. జీ20 దేశాల ప్రతినిధులు వస్తున్నప్పుడు ఇలాంటి పని చేయడం ప్రధానమంత్రిగారి స్ఫూర్తికి మచ్చ. ప్రధానమంత్రి చాలా కష్టపడి జీ20 సమావేశాలను మన దేశానికి తీసుకొచ్చినప్పుడు, అన్ని రాష్ట్రాలు సహకరించాలి. దురదృష్టం ఏమిటంటే... గూండాలకి అధికారం ఇస్తే జీ20 తాలూకు విశిష్టత వారికి ఏమర్ధమవుతుంది? పోలీసులు కోఆపరేట్ చేయమని నన్ను ఆపేశారు తప్ప, ఏమీ చెప్పలేదు’ అని పవన్ అన్నారు.