కొనసాగుతున్న ‘జవాన్’ ప్రభంజనం.. మూడ్రోజుల్లో 350 కోట్ల వసూళ్లు
- అట్లీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం
- గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల
- సూపర్ హిట్ టాక్ సొంతం
తొలి రోజే రూ. 130 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. మూడో రోజు వీకెండ్ శనివారం మరో 74 కోట్లు రాబట్టింది. హిందీ బెల్ట్ లో 62.85 శాతం ఆక్యుపెన్సీతో దూసుకెళ్తోంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. వీటిలో భారత్‌లో హిందీ, తమిళ్, తెలుగులో కలిపి 202.73 కోట్లు వసూలు చేసిందని అంటున్నారు.