Vishal: ‘మార్క్ ఆంటోని’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజువల్స్!

Mark Antony lyrical song released
షార్ట్స్‌లో చూడండి
విల‌క్ష‌ణ‌మైన సినిమాలు, విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌తో 'పురచ్చి తలపతి' అనిపించుకుంటూ టాలీవుడ్ లో కూడా సుప‌రిచిత‌మై త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు విశాల్. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’ వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ అవుతోంది. 

పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్‌పై అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వినోద్ కుమార్ నిర్మించారు. ఇక ఈ చిత్రంలో కీలకపాత్రలో ఎస్.జె.సూర్య నటించగా, విశాల్ కి జోడీగా 'రీతూ వర్మ' కనిపించనుంది. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా విశాల్ ద్విపాత్రాభినయం చేయగా, తెలుగు నటుడు సునీల్ .. తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 

సెన్సేషనల్ కంపోజర్ జి.వి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, మొదటి మూడు సింగిల్స్ కు భారీ స్పందన లభించింది. ఈ సినిమా నుంచి విశాల్ ఆలపించిన 'అదరద గుండె అదరద మావా.. బెదరగ బెంగ మొదలవదా' అనే లిరికల్ సాంగ్ తో అందరినీ ఎట్రాక్ట్ చేయగా ఇప్పుడు మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. 

'భువికి తరలిరా వీరభద్రుడా .. మహిమ చూపరా ప్రళయ రుద్రుడా .. ఉగ్రనేత్రుడా ఉరిమి చూడరా .. 
ఊచకోతనే మొదలిడ ఇటురా' అంటూ ఈ సాంగ్ లో బీట్ హైలైట్ కాగా.. విశాల్ గెటప్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. లిరిసిస్ట్ భువన చంద్ర రాసిన లిరిక్స్, హేమచంద్ర గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. ఈ పాట కథానాయకుడి ఆవేశాన్ని చాటి చెప్పేలా ఉంది, పాటలో కొన్ని హై మూమెంట్స్ కూడా ఉన్నాయి. వీరభద్రుడిని ప్రార్థిస్తూ సాగిన ఈ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ తెప్పించేలా ఆద్యంతం సాగింది.

Go Back to Shorts
Vishal
Ritu Varma
SJ Surya
Mark Antony

More Telugu News